హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 22 : ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వెనకా ముందు చూడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశ పెట్టింది. సరపడా బస్సులు, సరైన పర్యవేక్షణ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాజాగా సామర్థ్యానికి మించి(Overloaded) ప్రయాణికులు ఎక్కడంతో బస్సు నడపడం ఇబ్బందవుతుం దంటూ నడి రోడ్డుపై నిలిపివేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో(Huzurabad) జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. గురువారం సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్ వెళ్తుండగా, హుజూరాబాద్ బస్టాండ్‌లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్సు ఎక్కారు. డ్రైవర్( RTC driver) ఎంత చెప్పినా వినకుండా ప్రయాణికులు బస్సు దిగకపోవడంతో చేసేదేమిలేక ఓవర్ లోడ్‌తోనే బస్సును బయటకు తీసుకెళ్లాడు. సైడ్ వ్యూ మిర్రర్లలో పక్కనుంచి వచ్చే వాహనాలు కనపడకపోవడంతో, ప్రమాదాలు జరిగే ప్రమాదముందని బస్సును నడిరోడ్డుపైనే నిలిపివేశాడు.
ఇలా అయితే బస్సును నడపలేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులు సహకరిస్తేనే బస్సు ముందుకు కదులుతుందని తెగేసి చెప్పాడు. ఎట్టకేలకు ప్రయాణికులు సహకరించడంతో బస్సు ముందుకు కదిలింది. సరిపడా సర్వీసులు నడపకపోవడంతో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదని ప్రయాణికులు ఆగ్రహించారు. ఈ బస్సు కాకపోతే, ఇంకో బస్సు ఎప్పుడు వస్తదో తెలియదని, వచ్చినా ఎంత రద్దీ ఉంటుందోనని తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తున్నారు.
55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 ఎక్కితే ఎలా
కరీంనగర్ జిల్లాలో నడి రోడ్డుపై ఆర్టీసి బస్సును ఆపిన డ్రైవర్
హుజురాబాద్ బస్సులో 55 మందికి గాను 110 మంది ఎక్కారని, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని కొంతమంది ప్రయాణికులు దిగాలని బస్సు ఆపిన డ్రైవర్. pic.twitter.com/g9rWFmBZAp
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2024