హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): సమాజంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని మీడి యా అకాడమీ కార్యాలయంలో సోషల్ మీడియా జర్నలిస్టుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాల పెంపునకు ఈ శిక్షణ తరగతు లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
మాడభూషి శ్రీధర్ సమాచార హక్కు చట్టం గురించి, సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ భాషాదోషాల నివారణ, ఉడుముల సుధాకర్‌రెడ్డి డి జిటల్ మీడియాలో వాస్తవాల ధ్రువీకరణ, గోవిందరెడ్డి నేరవార్తల సేకరణ, పాశం యాదగిరి సామాజిక పద్ధతులపై వివరించారు. కార్యక్రమంలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్రావు, సోషల్ మీడియా ఫోరం రాష్ట్ర కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.