హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : విద్యావేత్త, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు సువర్ణ వినాయక్ ఉద్యోగ విరమణ అభినందన సభ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ‘సువర్ణాధ్యాయం’ అభినందన సంచికను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 42 ఏండ్లపాటు సువర్ణ వినాయక్ విద్యారంగం, తెలుగు భాషాభివృద్ధికి పాటుపడ్డారని కొనియాడారు. అనంతరం సవర్ణ వినాయక్ – మాధవి దంపతులను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ వెల్దండ నిత్యానందరావు, పాఠశాల విద్యాశాఖ అడిషన్ డైరెక్టర్లు కే లింగయ్య, శ్రీనివాసచారి, టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు బాణాల మన్మథరెడ్డి, మాజీ అడిషనల్ డైరెక్టర్ కృష్ణారావు, ప్రొఫెసర్ ఉపేందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీనివాస్, హెచ్ఎం అసొసియేషన్ అధ్యక్షుడు రాజభానుచంద్రప్రకాశ్, ట్రస్మా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, గాజుల రవీందర్, భానుప్రకాశ్, సంబరాజు రవిప్రకాశ్, ఒజ్జల శరత్‌బాబు, కోట సుకన్య తదితరులు పాల్గొన్నారు.