Group-2 Results | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ మంగళవారం విడుదలచేయనున్నది. 783 పోస్టుల భర్తీకి 2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకాగా, 5లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2023 ఆగస్టు 29, 30న పరీక్షలు నిర్వహించారు.
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనంలో మాడల్ స్కూల్ టీచర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ నేతలు కోరారు. చీఫ్ ఎగ్జామినర్, సబ్జెక్టు ఎక్స్పర్ట్, సీఎస్‌డీవో విధుల్లో అన్యాయం చేయొద్దని ఇంటర్‌బోర్డు సెక్రటరీ కృష్ణఆదిత్యకు వినతిపత్రం సమర్పించారు.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీ కోసం నిరుడు నవంబర్ 11న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఫైనల్ కీ ఆధారంగా వెల్లడించారు.