హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిర్వహించిన పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు వారంలోగా విడుదలయ్యే అవకాశమున్నది. ఇప్పటికే మూల్యాంకనం సహా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. ఫలితాల విడుదలకు నాలుగు తేదీలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ నెల 8 లేదా 10న ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ నెల 10 లేదా 12వ తేదీల్లో పదో తరగతి ఫలితాలను విడుదల చేసే అవకాశమున్నది. ఫలితాల్లో తప్పుల నివారణ కోసం ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్ చేస్తున్నామని, టెక్నికల్ ట్రయల్స్‌ను పలుమార్లు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తికాగానే ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు.