హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నివేదిక ఎట్టకేలకు విద్యాశాఖకు చేరింది. స్పోర్ట్స్ అథారిటీ అధికారులు 96 మంది అర్హులైన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖకు పంపించారు. ఈ కోటాలో మొత్తం 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించగా, 96కిపైగా అర్హులున్నట్టుగా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు తేల్చారు.
‘డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా స్కాం’ పేరుతో సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై ప్రభుత్వ వర్గాలు విద్యాశాఖను ఆరా తీశాయి. మొత్తంగా స్పోర్ట్స్ కోటా పోస్టులకు టీచర్ పోస్టుల భర్తీపై నిర్వహించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్లో అర్హులైన వారి జాబితా విద్యాశాఖకు చేరడం విశేషం. ఈ జాబితాను బట్టి జిల్లా, రోస్టర్, ఖాళీలను బట్టి జిల్లాలవారీగా డీఈవోలు నియామకపత్రాలిస్తారు.