హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని భాషా పండితుల అప్‌గ్రేడేషన్ (పదోన్నతుల) షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్‌యూపీపీ-టీఎస్) కోరింది.
గురువారం ముఖ్య కార్యదర్శిని కలిసి వినతిపత్రం అందచేశామని సంఘం రాష్ట్ర నాయకులు జగదీశ్, నర్సింహులు తెలిపారు.