చిక్కడపల్లి, జూన్ 14: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వడ్డెర సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ ఆధ్వర్యంలో వడ్డెర సంఘం నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మంత్రిని కలిసిన వారిలో జెరిపేటి సత్యనారాయణ రాజు, ఎత్తరి అంతయ్య, డాక్టర్ ఓర్సు కృష్ణయ్య, వల్లపు లక్ష్మీనారాయణ, దండవుల రాములు ,పల్లపు సత్యనారాయణ, పల్లపు గణేశ్, తన్నీరు వెంకటకృష్ణ తదితరులు ఉన్నారు.