హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే విజయమని ఇప్పటికే పలు సర్వేలు సూచించగా, తాజాగా ఆరా సంస్థ నిర్వహించిన పోస్ట్‌పోల్ సర్వేలోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. పోలింగ్ అనంతరం నిర్వహించిన ఆరా సర్వే ప్రకారం.. టీఆర్ఎస్ 50.82% ఓట్లతో స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించనున్నది. బీజేపీకి 33.86%, కాంగ్రెస్‌కు 10.94%, ఇతరులకు 4.38% ఓట్లు దక్కుతాయని పేర్కొన్నది. నియోజకవర్గంలోని అన్ని వర్గాలు, వయసుల వారు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపినట్టు వెల్లడించింది. నియోజకవర్గం మొత్తం ప్రతి మండలం, ప్రతి బూత్లోనూ టీఆర్ఎస్కే అధిక ఓట్లు లభించాయని, స్పష్టమైన ఆధిక్యం కనబరించిందని పేర్కొన్నది.
