హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 87.14%, మధ్యాహ్నం 89.32% మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. జూన్ 1 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.