కొండాపూర్, జూలై 27 : బాలుడిని కత్తితో బెదిరించి సెల్‌ఫోన్ దొంగలించిన పాత నేరస్థులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక సెల్‌ఫోన్, ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్సీపురం ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 22వ తేదిన రాత్రి 11.30 గంటలకు చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుడిసెలో నివాసం ఉండే జాన్ సయ్యద్ అనే బాలుడు ఒంటరిగా ఉండడంతో ఇద్దరు వ్యక్తులు వచ్చి మంచినీళ్లు ఇవ్వాలని కోరడంతో జాన్ నీళ్లు ఇచ్చాడు.
అక్కడి నుంచి వెళ్లిన ఆ ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో తిరిగి గుడిసె వద్దకు వచ్చి కత్తితో జాన్సయ్యద్ను బెదిరించి సెల్‌ఫోన్‌ను లాక్కేళ్లారు. దీంతో జాన్చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా సోమవారం ఉదయం పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న ఒక నిందితుడు భాను ప్రసాద్(25)ను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో మంగళ్‌హట్ శివాలాల్నగర్కు చెందిన మరో నిందితుడు విష్ణువర్ధన్(21)ను అదుపులోకి తీసుకున్నారు.
వీరిద్దరూ పాత నేరస్తులుగా గుర్తించి, వారి నుంచి ఒక సెల్‌ఫోన్, ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తలిరంచారు. మేస్ర్తీ పనిచేసే విష్ణువర్దన్, పెయింటర్‌గా పనిచేసే భాను ప్రసాద్ లిద్దరూ కలిసి నగరంలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. వీరిపై సైబరాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 11 దొంగతనాల కేసులు ఉన్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో చందానగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస తేజ, సిబ్బంది పాల్గొన్నారు.