ధూళిమిట్ట : దట్టంగా కమ్ముకున్న మంచు దుప్పటి ఒకవైపు. ఆకాశాన్ని తాకేలా ఉన్న తాటి చెట్ల సోయగం మరోవైపు. వాటి అందాలను తోసి రాజని తాటి చెట్టు సిగలో ఎర్రెర్రని ముద్ద మందారంలా భానుడు ధగధగమని కాంతులీనుతూ..ఉదయిస్తున్నట్టుగా ఉన్న ఈ ముగ్ధ మనోహర చిత్రం.. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి గ్రామంలో ఆవిష్కృతమవగా.. నమస్తే తెలంగాణ క్లిక్ మనిపించింది.