హరారే: ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇండియన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) సూపర్ సెంచరీ నమోదు చేశాడు. సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తిస్తున్న సూర్యవంశీ కేవలం 55 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. అతని సెంచరీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఆరంభం నుంచి సూర్యవంశీ క్వాలిటీ స్ట్రోక్స్‌తో ఆకట్టుకున్నాడు. భారీ సిక్సర్లతో ఇండ్లండ్ స్పిన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 రన్స్ స్కోరు చేసి ఔటయ్యాడు. తొలుత టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. తాజా సమాచారం ప్రకారం ఇండియా 21 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది.
ఈ వరల్డ్‌కప్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు సూర్యవంశీ. అండర్19 వరల్డ్‌కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో ఇప్పటికే 20 సిక్సర్లు కొట్టాడు వైభవ్. అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ 18(2022), ఫిన్ అలెన్ 18(2016, 2018) సిక్సర్లు కొట్టారు.