సుల్తాన్‌బజార్, ఆగస్టు 11: టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఘటనలో కోచింగ్ సెంటర్ యజమాని అశోక్‌ను బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఇన్స్పెక్టర్ శంకర్ వివరాల ప్రకారం.. గురువారం మూకుమ్మడిగా ముట్టడికి వచ్చిన నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి, వారిని పెడదోవ పట్టించిన ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల పాత్ర ఉన్నదని గుర్తించారు.
అభ్యర్థులను రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ కోచింగ్ సెంటర్ యజమాని అశోక్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అతడిపై నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లలో ఐదు కేసులు నమోదై ఉన్నట్టు ఇన్స్పెక్టర్ వివరించారు.