జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కేఎల్ఐ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన అదనపు సీనియర్ సివిల్, అసిస్టెంట్ సెషన్స్ న్యాయస్థాన కార్యాలయాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే కుషా, కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, సీనియర్ సివిల్ న్యాయమూర్తి గంట కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి పూజిత, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి కండ్లపురం కవిత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘురాంరెడ్డి, న్యాయవాదులు పాల్గ్గొన్నారు.