కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్న తీరును రైతులకు వివరించేందుకు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నాయకులను ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకున్నది. ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అడ్డంకులు సృష్టించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
కాన్వాయ్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరికి కేటీఆర్ కాన్వాయ్‌తోపాటు వేల మంది బీఆర్ఎస్ శ్రేణులు కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు చేరుకున్నారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నా పంటలకు రాకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేశారు.

కన్నెపల్లి పంపుహౌస్ వద్ద పోలీసులతో మాట్లాడుతున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు

జనగామ జిల్లా కోమళ్ల టోల్గేట్ వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకుంటున్న పోలీసులను పక్కకు జరిపి వాహనాన్ని పంపించే ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల టోల్గేట్ వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్‌తో వాగ్వాదం చేస్తున్న ఎమ్మెల్యే పల్లా

కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ఎమ్మెల్యే సంజయ్, దావ వసంత తదితరులను అడ్డుకుంటున్న పోలీసులు

కన్నెపల్లి పంపుహౌస్ వద్ద మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు

జనగామ జిల్లా కోమళ్ల టోల్‌ప్లాజా వద్ద లారీలు అడ్డుపెట్టి బీఆర్ఎస్ నాయకుల వాహనాల అడ్డగింత

కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో గేట్‌ను లేపుతున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు. చిత్రంలో మాజీ మంత్రి సత్యవతి, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి తదితరులు

కన్నెపల్లి పంపుహౌస్ వద్ద రోడ్డుపై బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు