సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 18:05:23

యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కార్తీకమాసం ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల సందడి నెలకొంది. పుష్కరిణి, కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయశాల, తిరు వీధులు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం స్వామివారికి తలనీలాలు సమర్పించి, విష్ణు పుష్కరిణిలో స్నాన మాచరించిన భక్తులు క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి దర్శనం కోసం క్యూలెన్లలో బారులు తీరారు.