ఏఐపీఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రత్నాకర్‌రావు
ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన పీసర రత్నాకర్‌రావు మూడోసారి ఎన్నికయ్యారు. చెన్నైలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశం లో 23 రాష్ర్టాలకు చెందిన విద్యుత్తు ఇంజినీర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని 2024 -27కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణకు చెందిన పీసర రత్నాకర్‌రావు మూడోసారి ఎన్నికయ్యారు. చెన్నైలో నిర్వహించిన ఫెడరేషన్ సమావేశం లో 23 రాష్ర్టాలకు చెందిన విద్యుత్తు ఇంజినీర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని 2024 -27కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన శైలేంద్ర దూబే జాతీయ అధ్యక్షుడిగా, తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రత్నాకర్‌రావు ఏఐపీఈఎఫ్ సెక్రటరీ జనరల్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు.అడిషనల్ సెక్రటరీ జనరల్‌గా రాష్ర్టానికి చెందిన ఎం. శివశంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పీ శ్రీనాథ్‌రెడ్డి, సెక్రటరీగా పరికి సదానందం, జాయింట్ సెక్రటరీలుగా మంగీలాల్, జనప్రియ, వెంకటనారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా అంజయ్య, రమణారావు, పీవీరావు, వరప్రసాద్‌రావు, విద్యాసాగర్‌లు రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో టీఎస్‌పీఈఏ సభ్యులు, విద్యుత్తు ఇంజినీర్లు ఏఐపీఈఎఫ్ సెక్రటరీ జనరల్ రత్నాకర్‌రావుతో పాటు నూతన కార్యవర్గ సభ్యులందరినీ ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ నాయకులు సత్యనారాయణరావు, కిషోర్, సతీశ్, సురేశ్, వెంకటేశ్, బుచ్చయ్య, గోపాల్‌రావు, బాగయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

