భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 5 : హైదరాబాద్ ఎగువ నుంచి వస్తున్న వరదతో భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు -రుద్రవెల్లి వద్ద లోలెవెల్ బ్రిడ్జి పైనుంచి మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆదివారం ఉదయం నుంచి పోచంపల్లి- బీబీనగర్, భువనగిరికి రాకపోకలు స్తంభించిపోయాయి.
మూసీ నది వద్ద రోడ్ల కిరివైపులా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వాహనాలు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వాహనదారులు మండల ప్రజలు పెద్ద రావులపల్లి మీదుగా బీబీనగర్, భువనగిరికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.