జగిత్యాల : రాయికల్(Raikal) మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు (Mora Hanumandlu), వైస్ చైర్ పర్సన్ గండ్ర రమాదేవిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. (Defeated) చైర్మన్, వైస్ చైర్ పర్సన్ పై తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం గతంలో ప్రతిపాదించారు.
కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మాన ప్రతిపాదన నేపథ్యంలో జగిత్యాల ఆర్డీవో నరసింహా మూర్తి శుక్రవారం అవిశ్వాస తీర్మానం రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రవేశపెట్టారు. అయితే అవిశ్వాస తీర్మానానికి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌తో పాటు ఏడుగురు కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి 12 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్‌కు చెందిన ఒక కౌన్సిలర్, బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్ మాత్రమే హాజరయ్యారు.
దీంతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. బీఆ ర్ఎస్కు చెందిన చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌పై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కౌన్సిలర్లతో సంప్రదింపులు జరిపి సయోధ్య కుదర్చడంతో అవిశ్వాసం వీగిపోయింది.