వేములవాడ రూరల్, నవంబర్ 7: కొడుకు డబ్బులు చెల్లించడం లేదని తల్లిని కిడ్నాప్ చేసిన కథ సుఖాంతమైంది. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సీఐ వీరప్రసాద్ వివరాలు వెల్లడించారు. చెరుకు పంట కోసే విషయంలో వేములవాడ మండలం కొడుముంజ గ్రా మానికి చెందిన అన్నదమ్ములు పల్లపు శ్రీనివాస్, వెంకటేశ్‌కు మహారాష్ట్రకు చెందిన లా లు నాగోరావ్ దయారంగలోడ్ మధ్య ఒ ప్పందం కుదిరింది. ఈ మేరకు లాలు నాగోరావ్ దయారంగలోడ్ వద్ద రూ.3.80 లక్ష లు తీసుకున్న శ్రీనివాస్.. చెరుకు కోసేందు కు కూలీలను పంపకపోవడంతో కొన్ని రో జుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.
కూలీల కోసం ఇచ్చిన డబ్బులను శ్రీనివాస్ చెల్లించకపోవడంతో బుధవారం నాగోరావ్ దయారంగ్లోడ్ అతని భార్య పంచతుల, మరో నలుగురు వ్యక్తులు వేములవాడ మం డలం కొడుముంజకు చేరుకున్నారు. ఇంటి వద్ద శ్రీనివాస్ లేకపోవడంతో అతని తల్లి భీమాబాయిని కిడ్నాప్ చేసి మహారాష్ట్రలోని నాందేడ్‌కు తీసుకెళ్లారు. భీమాబాయి మనువడు వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రెండు బృందాలు మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లి భీమాబాయిని కిడ్నాప్ చేసిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని సీఐ వెల్లడించారు.