ప్లాస్టిక్క్రష్ ఫ్యాక్టరీ
యావత్తు జగత్తును వణికిస్తున్న రాకాసి ప్లాస్టిక్. పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న రక్కసి ప్లాస్టిక్. ఇటీవల ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం పెద్దఎత్తున పెరిగిపోతున్నది. ఇలాంటి భూతం నుంచి బయటపడాలంటే రీసైక్లింగ్, పునర్వినియోగం ఒక్కటే మార్గం.
- ప్లాస్టిక్ బాటిళ్లను కరిగించి వస్ర్తాల తయారీకి ముడిసరుకుగా మార్చి..
- రోజుకు 150 టన్నుల బాటిళ్లను తినేస్తున్న కుందనా టెక్నో టెక్స్
- బీట్ ది ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్‌తో సంవత్సరం పొడవునా కార్యక్రమాలు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): యావత్తు జగత్తును వణికిస్తున్న రాకాసి ప్లాస్టిక్. పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న రక్కసి ప్లాస్టిక్. ఇటీవల ప్లాస్టిక్ బాటిళ్ల వాడకం పెద్దఎత్తున పెరిగిపోతున్నది. ఇలాంటి భూతం నుంచి బయటపడాలంటే రీసైక్లింగ్, పునర్వినియోగం ఒక్కటే మార్గం. అ దిశగా పనిచేస్తున్నది రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో ఉన్న కుందనా టెక్నో టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫ్యాక్టరీ ప్లాస్టిక్ బాటిళ్లను మింగేస్తున్నది. రోజుకు 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ బాటిళ్లను క్రష్ చేస్తున్నది. టీ షర్ట్లు, వస్ర్తాల తయారీలో వినియోగించే ముడిసరుకును ఉత్పత్తి చేస్తున్నది. టీషర్ట్లు తయారుచేసే ఫైబర్, ఫుడ్ గ్రేడ్ గ్రాన్యూల్స్ ఉత్పత్తి చేసి గుజరాత్సహా ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ‘బీట్ ది ప్లాస్టిక్ పొల్యూషన్’ థీమ్‌తో ఏడాదంతా పర్యావరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏడాదికి 54,750 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఖతం
వాటర్‌బాటిళ్లు, కూల్డ్రింక్బాటిళ్లు, ఇతర పానీయాల ప్లాస్టిక్బాటిళ్లను, వాడిపారేసిన బాటిళ్లను ఈ కంపెనీలో ముడిసరుకుగా ఉపయోగిస్తారు. రోజుకు 150 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేస్తారు. అంటే ఏడాదికి 54,750 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను ఈ కంపెనీలో ముడిసరుకుగా వినియోగిస్తున్నారు. ఏడాదికి లక్ష మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేసేలా కంపెనీ విస్తరణప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ర్టాల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లను సేకరిస్తున్నారు. ఆ ప్లాస్టిక్‌ను ఫైబర్, ఫుడ్ గ్రేడ్ గ్రాన్యూల్స్‌గా తయారుచేస్తారు. వీటిని టెక్స్టైల్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
60 శాతం ప్లాస్టిక్ రీసైకిల్
మనం వాడుతున్న దాంట్లో 60 శాతం ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసుకోవచ్చు. తెలంగాణలో ప్లాస్టిక్ రీసైక్లిం గ్, పునర్వినియోగాన్ని విరివిగా ప్రోత్సహిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అంచనాల ప్రకారం రాష్ట్రంలో రోజూ 40 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థా లు పోగవుతున్నాయి. ఇవి భూమిలో జీర్ణమయ్యేవి కాకపోవడంతో ప్రత్యేక పొరను ఏర్పరుచుకొని వాననీరు భూమిలోకి ఇంకకుండా అడ్డుపడుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

