హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీఎల్) అధికారుల మొబైల్ నంబర్లు మారాయి. ఫ్యూజ్ ఆఫ్ కాల్, సెంట్రల్ బ్రేక్ డౌన్స్, ఓఅండ్ఎం సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులు సెల్‌ఫోన్ నెంబర్లు మార్చారు. ఆయా నంబర్ల కోసం రెండు మూడు రోజుల్లో సంస్థ వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు. విద్యుత్తు బిల్లులపై అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏఏవో)ల నంబర్లను ముద్రించాలని ముషారఫ్ ఫారూకీ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు పనులను లైసెన్స్డ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లతోనే చేయించుకోవాలని.. క్వాలిపైడ్ వైర్మెన్తోనే చేయించుకోవాలని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జనరల్(సీఈఐజీ) ప్రకటనలో తెలిపారు. నాణ్యమైన విద్యుత్తు వైర్లనే వినియోగించాలని, లైట్ పాయింట్స్‌కు 1.5 స్కేయర్ ఎంఎం, పవర్ పాయింట్లకు 2.5 స్కేయర్ ఎంఎం, ఏసీ యూనిట్లకు 4 స్కేయర్ ఎంఎం కేబుళ్లను వాడాలని కోరారు. వోల్టేజ్ స్టెబిలైజర్లను వాడాలని సూచించారు.