రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జులై 2న నిర్వహించే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉమ్మడి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జులై 2న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని తెలిపారు. బేగంపేటలో యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలుకుతారని చెప్పారు.

10 వేల బైక్‌లతో భారీ ర్యాలీగా బేగంపేట, రాజ్‌భవన్‌రోడ్, నెక్లెస్ రోడ్ మీదుగా జలవిహార్ చేరుకోనున్నట్లు మంత్రులు వెల్లడించారు. యశ్వంత్ సిన్హాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని వారు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అహంకారపూరితంగా, నియంతృత్వంగా దేశాన్ని పాలిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. న్యాయ కోవిదులు, భారత విదేశాంగ విధానం తెలిసిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. యశ్వంత్ సిన్హాకు అద్భుతమైన స్వాగతం పలుకుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్‌యాదవ్, పద్మారావు నగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్‌గౌడ్, బాలరాజ్యాదవ్, శైలేందర్, బాబురావు, కృష్ణగౌడ్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?