TS Weather | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా రాబోయే వారంపాటు వాతావరణం చల్లగా ఉండటంతో పాటు వర్షాలు కురిసే అవకాశాలు లేవని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆకాశం ప్రశాంతంగా ఉంటుందని, మేఘాలు కూడా ఉండవని పేర్కొన్నది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల వరకు పడిపోనున్నట్టు తెలిపింది.
ఈ వారంపా టు ఎలాంటి తుఫానులు సంభవించే పరిస్థితులు లేవని ప్రకటించింది. ప్రస్తుతం మాల్దీవులు వద్ద ఉపరితల ఆవర్తనం ఉన్నదని, దీని వల్ల తెలుగు రాష్ర్టాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. చిరుజల్లులు కురిసే అవకాశమూ లేదని స్పష్టం చేసింది. ఈ నెల 19 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశమే లేదని వెల్లడించింది. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు మ రింత తగ్గే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.