సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 12:53:50

మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్

మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్

జగిత్యాల : రాయికల్ మండలం కొత్తపేట్ గ్రామం శివాజీనగర్ లో ఇటీవల కరోనా పరీక్షలు చేయగా 40 మందికి పైగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో శివాజీనగర్ ప్రజలు భయబ్రాంతులకు గురి కాగా జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం కల్పించారు. గ్రామస్తులకు సర్పంచ్, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 500 మాస్కులు ఎమ్మెల్యే అందజేశారు. 

కార్యక్రమంలో  సర్పంచ్ మన్నెగుండ్ల వెంకమ్మ, బత్తిని రాజేశం, ఎంపీటీసీ మందుల శ్రీనివాస్ , ఉప సర్పంచ్ రాజేష్, సింగిల్ విండో చైర్మన్ మల్లారెడ్డి, మహేశ్వర్ రావు, కోల శ్రీనివాస్, తలారి రాజేష్, నాయకులు లావుడ్యా సురేందర్ నాయక్, శ్రీనివాస్ గౌడ్, గంగారెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.


logo