Regional Parties | కూటమిలో లేకుంటే ఎదురీతే.. ఒంటరి పోరులో వెనుకబడ్డ ప్రాంతీయ శక్తులు
ఎన్డీఏ లేదా ఇండియా కూటమి ఈ రెండింటిలో ఏదో ఒక కూటమితో జత కట్టకుండా, ఒంటరిగా బరిలోకి దిగిన పలు ప్రాంతీయ శక్తులు ఈ సారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోవడం ఒక బాధాకర పరిణామం.
- లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీఎస్పీ, బీజేడీ, బీఆర్ఎస్, ఏఐడీఎంకే
- ప్రాంతీయ ఆకాంక్షలకు తీవ్ర విఘాతం.. కాంగ్రెస్‌కు 11 రాష్ర్టాలో ప్రాతినిధ్యం నిల్
Regional Parties | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఎన్డీఏ లేదా ఇండియా కూటమి ఈ రెండింటిలో ఏదో ఒక కూటమితో జత కట్టకుండా, ఒంటరిగా బరిలోకి దిగిన పలు ప్రాంతీయ శక్తులు ఈ సారి లోక్‌సభలో ప్రాతినిధ్యం కోల్పోవడం ఒక బాధాకర పరిణామం. దీంతో ఆయా రాష్ర్టాల గొంతుకను, ప్రాంతీయ ఆంకాంక్షలను పార్లమెంట్లో బలంగా వినిపించే అవకాశాన్ని కోల్పోయినట్టయ్యింది. దేశంలో కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ శక్తులు తమ సత్తా చాటుతున్నాయి.
సంకీర్ణాలయుగంలో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడమే కాకుండా, తమ రాష్ర్టాలకు దక్కాల్సిన ప్రయోజనాలను సాధించుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తూ వచ్చాయి. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి హోరాహోరీగా తలపడ్డాయి. 2004 నుంచి ఈ రెండు కూటమిల మధ్య (ఎన్డీఏ, యూపీఏ) అధికార బదలాయింపు జరుగుతున్నది.
2024 ఎన్నికల్లో ఈ రెండు కూటములకు సమానదూరం పాటించిన పార్టీల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గింది. దీం తో సంఖ్యాపరంగానే కాకుండా ప్రాంతీయ ఆ కాంక్షల ప్రతిరూపంగా వ్యవహరించిన అనేక ప్రాంతీయ పార్టీలు ఈసారి లోక్‌సభలో తమ గళాన్ని వినిపించే అవకాశాన్ని కోల్పోయాయి. అటువంటి పార్టీల జాబితాలో బీజేడీ (బిజూ జనతాదళ్), బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ), బీఆర్ఎస్, ఏఐడీఎంకే పార్టీలు ఉన్నాయి.
అటో.. ఇటో..
తాజా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పక్షం లేదా బీజేపీ పక్షం వైపే ఉన్న పార్టీలే లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని కొనసాగించే అవకాశాన్ని పొందాయని తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అలా లేని పార్టీలను రెండు జాతీయ పార్టీలు తమ జిత్తులమారి ఎత్తులతో మింగేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 18వ లోక్‌సభకు దేశవ్యాప్తంగా 52 రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
ఇందులో కాంగ్రెస్, బీజేపీ సహా మిగిలిన జాతీయ పార్టీలతో సఖ్యతతో ఉండటమో, వాటి ప్రత్యక్ష, పరోక్ష మద్దతు లేదా ప్రోత్సాహంతోనో మెజారిటీ పార్టీలు లోక్‌సభకు రాగలిగాయి అని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. తమతో ఆయా సందర్భాల్లో విబేధించిన ప్రాంతీయ పార్టీలపై కాంగ్రెస్, బీజేపీలు పగ సాధించాయని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని ఉదహరిస్తున్నారు.
రాష్ర్టాలను ఏలిన అనేక పార్టీలు ఈసారి…
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ర్టాల్లో గతంలో ప్రభుత్వాలను నడిపిన రాజకీయ పార్టీలు ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యానికి నోచుకోలేకపోయాయి. నిజానికి సంకీర్ణయుగంలో ప్రాంతీయ ఆకాంక్షలను పార్లమెంట్లో బలంగా వినిపించడమే కాకుం డా, ఆయా రాష్ర్టాలకు దక్కాల్సిన ప్రయోజనాలను సాధించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
ఈసారి అటువంటి గొంతు వినిపించే అవకాశాన్ని పలు ప్రాంతీయ శక్తులు కోల్పోయాయా? కోల్పోయేలా జాతీయ పార్టీలు వ్యవహరించాయా? జాతీయ పార్టీలను ఎదుర్కోవడంలో ప్రాంతీయ పార్టీలు విఫలమయ్యాయా? వంటి అంశాలపై విస్తృతంగా చర్చ సాగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ, ఒడిశాలో బీజేడీ, తమిళనాడులో ఏఐడీఎంకే, తెలంగాణలో బీఆర్ఎస్ తదితర పార్టీలు ఈసారి లోక్‌సభలో తమతమ ప్రాతినిధ్యాన్ని కోల్పోవడం గమనార్హం.
వైఫల్యంలో బీఎస్పీదే రికార్డు
ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేక రికార్డులకు వేదికయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ సహా ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపు పొందిన జాతీయ పార్టీల కంటే బీఎస్పీ అత్యధిక స్థానాల్లో పోటీచేసింది. దేశవ్యాప్తంగా 488 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీచేసిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ.. ఈసారి ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేదు. ఘోర పరాజయాల్లో ఇదొక రికార్డు! గత లోక్‌సభలో ఆ పార్టీకి పది మంది సభ్యుల ప్రాతినిధ్యం ఉండటం విశేషం.
ఒడిశాలో 21 సంవత్సరాలుగా అధికారాన్ని చేపట్టిన నవీన్‌పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ (బిజూ జనతాదళ్) కూడా ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం కోల్పోయింది. గత లోక్‌సభలో ఇదే బీజేడీకి 12 మంది ఎంపీల బలం ఉండేది. తమిళనాడులో గతంలో అధికారంలో ఉన్న ఏఐడీఏంకే, తెలంగాణను అనేక రంగాల్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ సహా అనేక పార్టీలకు ఈసారి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం చేజారడం గమనార్హం.
11 రాష్ర్టాల్లో ఎంపీలు లేని కాంగ్రెస్
మరోవైపు ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దాదాపు పదకొండు రాష్ర్టాల నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్ము-కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము-కశ్మీర్, మిజోరాం, సిక్కిం, త్రిపుర, ఢిల్లీ తదితర రాష్ర్టాల నుంచి కనీసం ఒక్కొక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేకపోయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

