TSCOP | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ శాఖ సాంకేతిక వ్యవస్థలోని కీలక సమాచారంతా అంగ ట్లో సరుకుగా మారింది. డాటాబేస్ నుంచి నేరస్తుల సమాచారం మొదలు.. మహిళలు, పోలీస్స్టేషన్ల మెట్లెక్కిన బాధితుల వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాయి. డార్క్‌వెబ్‌లో డాలర్లకు ఇంత చొప్పున సమాచారం అమ్మేస్తున్నా రు. ఇటీవల ‘హ్యాక్ ఐ’ యాప్, తెలంగా ణ పోలీస్ ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్ నుంచి డేటాను దొంగించిన సైబర్ నేరగా ళ్లు.. శుక్రవారం ‘టీఎస్ కాప్’ అనే యా ప్ను సైతం హ్యాక్ చేశారు. ఈ మూడు కీలక డేటా బేస్‌ల నుంచి సుమారు 12 లక్షల మంది సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం. ఈ మూడు వ్యవస్థల నుంచి సేకరించిన డే టాను ‘బ్రీచ్ ఫోరం’లో అమ్మకానికి పె ట్టారు. కేవలం 120 డాలర్లు చెల్లించిన వారందరికీ ఈ డేటాను విక్రయిస్తున్నా రు. దీంతో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. ఐటీ చట్టం కింద దర్యాప్తు చేస్తున్నామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ తెలిపారు. ‘హ్యాక్ ఐ’ యా ప్ను హ్యాక్ చేసిన వారే.. టీఎస్ కాప్ యాప్‌ను సైతం హ్యాక్ చేశారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించినట్టు తెలిసింది.
టీఎస్‌కాప్ యాప్‌లో తెలంగాణ పోలీసుల నెట్వర్క్ సమగ్ర సమాచారం మొ త్తం ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకూ అందరి సమాచారం ఉంటుంది. పెట్రోలింగ్ సమయంలో తీసి న వ్యక్తుల చిత్రాలు, ఇంటిగ్రేటెడ్ ఫేషియ ల్ రికగ్నిషన్ సిస్టమ్, నేరస్తుల ఫొటోలు, నేరాల దృశ్యాలు, గుర్తు తెలియని పిల్లలు, మహిళలు, పురుషులు, మృతదేహాల ఫొటోల వంటివి ఉన్నాయి. తుపాకీ లైసెన్స్‌లు పొందిన వారి వివరాలు, అధికారుల వివరాలు ఉన్నాయి. ఈ యాప్‌ను వినియోగించేవారు పాస్‌వర్డ్‌ను స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలని అధికారులు సూచించారు.