హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీలాసెట్ పరీక్షలు శుక్రవారం జరగనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలిపారు.
ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు మూడు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. 76 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 57,715 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు.