Singur Lands | ఆగని బామ్మర్ది ఆక్రమణ.. సింగూరు భూముల్లో మంగళవారమూ యథేచ్ఛగా సాగిన కబ్జాపర్వం
Singur Lands | సింగూరు ముంపు భూముల్లో మంత్రి బామ్మర్ది కబ్జాపర్వం ఆగడం లేదు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ యథావిధిగా ఆక్రమణ పనులు కొనసాగాయి. మంత్రి అండదండలతోనే యథేచ్ఛగా ముంపు భూముల్లో పనులు సాగుతున్నట్టు తెలుస్తున్నది.
Singur Lands | సంగారెడ్డి, జూన్ 2 (నమసే తెలంగాణ): సింగూరు ముంపు భూముల్లో మంత్రి బామ్మర్ది కబ్జాపర్వం ఆగడం లేదు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ యథావిధిగా ఆక్రమణ పనులు కొనసాగాయి. మంత్రి అండదండలతోనే యథేచ్ఛగా ముంపు భూముల్లో పనులు సాగుతున్నట్టు తెలుస్తున్నది. ముంపు భూముల ఆక్రమణ వ్యవహారం బయటకు పొక్కినప్పటికీ అందోల్ నియోజకవర్గంలోని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సింగూరును మింగుతున్న భూమ్మర్ది’ శీర్షికన నమస్తే తెలంగాణ మెయిన్ పేజీలో మంగళవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. రాజకీయ వర్గాలతోపాటు అధికార వర్గాల్లోనూ ఈ ‘భూమ్మర్ది’ కథనం హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినప్పటికీ మంత్రి బామ్మర్ది మంగళవారం సింగూరు ముంపుభూముల్లో యథావిధిగా పనులు కొనసాగించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మట్టి కుప్పలు పోయడం, చదును చేయడం, బండరాళ్లను తొలగించడం వంటి పనులు చేపట్టారు. మంత్రి బామ్మర్ది రెండు రోజుల క్రితం ఇరిగేషన్ అధికారులతో రహస్యంగా సమావేశమై ముంపుభూముల వ్యవహారంపై చర్చించినట్టు తెలుసున్నది.
అధికార యంత్రాంగంలో కదలిక
నమస్తే తెలంగాణలో వచ్చిన భూమ్మర్ది కథనంతో అధికార వర్గాల్లో కదలిక వచ్చింది. కలెక్టర్ ప్రతీక్‌జైన్.. వట్పల్లి మండలం ఖాదిరాబాద్ పరిధిలో సింగూరు ముంపుభూముల ఆక్రమణలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సంయుక్త తనిఖీ బృందాన్ని ఏర్పాటుచేశారు. సింగూరు ముంపు భూముల్లో సర్వే నిర్వహించి ఆక్రమణలపై వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ బృందాన్ని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అందోల్ ఆర్డీవోకు ఆదేశాలు జారీచేసినట్టు కలెక్టర్ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ముంపు భూములు ఆక్రమణకు గురైనట్టు తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
ఈ మేరకు ఖాదిరాబాద్, సాయిపేట, మంతూరు గ్రామాల పరిధిలోని సింగూరు ముంపుభూముల్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నమస్తే తెలంగాణ భూమ్మర్ది కథనంపై అటు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా నాయకుల్లో కూడా జోరుగా చర్చ సాగుతున్నది. మంత్రి బామ్మర్ది ఆక్రమణలకు సిద్ధం కావడంపై కాంగ్రెస్ నాయకులు అసహనం వ్యక్తంచేసినట్టు తెలుస్తున్నది. ఈ కథనాన్ని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత అటు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
సాయిపేట గ్రామస్తుల ఆందోళన
మంత్రి బామ్మర్ది అక్రమ నిర్మాణాలతో సమీపంలో ఉన్న తమ గ్రామం మునిగిపోయే ప్రమాదం ఉన్నదని సాయిపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. అది ప్రభుత్వ భూమి అయినా కాపాడే వ్యవహారం తమది కాదని, కాపాడాల్సిన అవసరమూ తమకు లేదని చెప్తున్నారని సాయిపేట గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ముంపు భూముల్లో పనులు జరిగే సమయంలో స్థానికులు కొందరు అక్కడికి చేరుకోగానే పనులు ఆపేసినట్టు వారు తెలిపారు. ఆ పనులు జరుగుతుండగా తీసిన వీడియోలను స్థానికులు మీడియాకు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

