హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఈనెల 10న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. తెలంగాణ భవన్లో మధ్యా హ్నం 2 గంటలకు జరిగే ఈ విసృ్తతస్థాయి భేటీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు పాల్గొంటారు.
ఇది ఎన్నికల సంవత్సరం కావటంతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆహ్వానితులందరూ విధిగా సమావేశానికి హాజరు కావాలని అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు.