హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం నాంపల్లిలోని ఇంటర్‌బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఫలితాలు విడుదల చేశారు. ఈ సారి ఫస్టియర్‌లో 67.4%, సెకండియర్‌లో 50.82% ఉత్తీర్ణత నమోదయ్యింది. రెగ్యులర్ ఫలితాల తరహాలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలోనూ అమ్మాయిలే సత్తాచాటారు. ఫస్టియర్‌లో బాలికలు 73.88%, బాలురు 61.75% పాసయ్యారు.
ఇక సెకండియర్‌లో బాలికలు 54.47%, బాలురు 48.54% ఉత్తీర్ణత సాధించారు. మే 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించగా, 4,13,880 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 23 వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇచ్చారు. ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య, పరీక్షల విభాగం కంట్రోలర్ జయప్రదాబాయి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణత పెరిగింది. ఫస్టియర్, సెకండియర్ రెండింటిలోనూ ఉత్తీర్ణతశాతం పెరగడం గమనార్హం. ఈ సారి ఫస్టియర్‌లో 67.4% ఉత్తీర్ణత నమోదయ్యింది. 2024లో 63.86%, 2023లో 62.58% విద్యార్థులు పాసయ్యారు. సెక ండియర్లో ఈ సారి 50.82% పాసైతే. 2024లో 43.77%, 2023లో 46.06% పాసయ్యారు. కోర్సులవారీగా తీసుకుంటే ఎంపీసీలోనే అత్యధికులు పా సయ్యారు. ఫస్టియర్ ఎంపీసీలో 78.26%, సెకండియర్‌లో 59.06% ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్ బైపీపీలో 71.2%, సెకండియర్‌లో 54.05% చొ ప్పున పాసయ్యారు. సీఈసీ తీసుకుంటే ఫస్టియర్‌లో 37.72%, సెకండియర్‌లో 38.02% చొప్పున ఉత్తీర్ణత సాధించారు.