Instagram | వెంగళరావునగర్, సెప్టెంబర్ 28: ఇన్స్టాలో పరిచయమైన యువతిపై లైంగికదాడికి పాల్పడిన ఘటన మధురానగర్లో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం..ఏపీ ప ల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువతి (30) భర్త నుంచి విడాకులు తీసుకొని రహ్మత్నగర్లో ఉం టూ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేది.
ఇటీవల ఆమెకు ఇన్స్టాలో శశికిరణ్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం కాగా, మధురానగర్లోని తన మూవీ ఆఫీస్లో జాబ్ ఖాళీగా ఉన్నదని.. ఓసారి రావాలని పిలిచాడు. శుక్రవారం రాత్రి 9గంటలకు ఆఫీసుకు వెళ్లేసరికి అక్కడ శశికిరణ్ తప్ప ఎవరూ లేరు. తిరిగి వెళ్లేందుకు యత్నించగా తలుపునకు గడియ బిగించి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తెల్లవారుజాము 5గంటలకు ఆ యువతి తప్పించుకొ ని ఇంటికి చేరుకున్నది. కాగా, రూం లోనే ఉండిపోయిన వస్తువుల కోసం మళ్లీ వెళ్లగా గదికి తాళం ఉండడంతో పగులగొట్టేందుకు ప్రయత్నించింది. గమనించిన వాచ్మన్లు ఆరా తీసి డయల్ 100కు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.