ఐనవోలు( హనుమకొండ) : తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్, ఆర్చక బృందం ఆలయంలో తెల్లావారుజాము నుంచే స్వామి వారికి మొలుకోలుపు, నూతన వస్త్రాలంకరణం, పుణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మహానివేదనలతో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయా కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, కమిటీ సభ్యులు, అర్చకులు, ఈవో కందుల సుధాకర్, ఆలయా సిబ్బంది కాషాయ రంగు పతకాతంతో ఆలయా చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ముందుగా క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి ఆలయానికి జెండాను కట్టి, అనంతరం దేవాలయల గోపురంకు జెండాలను కట్టి జాతర ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
రేపు బోగి పండుగ ప్రత్యేక పూజలు
బోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో బుధవారం ఉదయం స్వామి వారికి ప్రాతకాలం మెలుకొలుపుతో పూజలు ప్రారంభమావుతాయి. విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచము, మహన్యాసపూర్వక ఏకాదశి, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, రాద్రభిషేకము, మంత్ర పుష్పములు దర్శనమలు పూజలు జరుగుతాయి. స్వామివారి దర్శనం 24 గంటల పాటు కొనసాగనుంది.