Rain Alert | హైదరాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేందం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్ , ఎల్లో హెచ్చరికలను జారీచేసింది. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అకడకడా వడగండ్లు కురిసే అవకాశం ఉన్నదని పేరొన్నది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాది భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మలాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నల్లగొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ , మలాజ్గిరి, వికారాబాద్, జనగాం తదితర జిల్లాల్లో అకడకడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది.