హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో పదోన్నతులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి, జ్యుడిషియల్ కమిషన్చేత విచారణ జరిపింపించాలని తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి బుధవారం చలో విద్యుత్తు సౌధకు పిలుపునిచ్చింది.
ఉద్యోగులంతా తరలివచ్చి మహాధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ కుమారస్వామి, కో చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, కో కన్వీనర్ భానుప్రకాశ్ పిలుపునిచ్చారు.
హాస్టల్ వెల్ఫేర్ సమస్యలు పరిష్కరించాలి: టీఎన్జీవో
హైదరాబాద్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ డిమాండ్ చేశారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ఫోరం సమావేశాన్ని అధ్యక్షుడు ఎండీ ఖాజా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్కర్లను కేటాయించాలని, గ్రీన్‌చానల్ ద్వారా బడ్జెట్‌ను విడుదల చేయాలని, పర్చేజ్ కమిటీలో హెచ్‌డబ్ల్యూవోలకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.