హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): క్యాడర్ కేటాయింపులు ఉద్యోగుల వ్యక్తిగత ప్రాధాన్యాలకంటే పరిపాలనా అవసరాలే కీలకమని హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రభుత్వం జారీచేసిన జీవో 33 చట్టబద్ధమేనని గతంలో సింగిల్జడ్జి ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
సింగి ల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ 13 మంది అసిస్టెంట్ రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు దాఖలు చేసిన అప్పీళ్లను డిస్మిస్ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎంమొహియుద్దీన్ ధర్మాసనం తీర్పు చెప్పింది.