హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పబ్లిక్ సూల్ నిధులు దుర్వినియోగమైనట్టు వస్తున్న అభియోగాలపై విచారణ జరపాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దుర్వినియోగంపై ప్రభుత్వానికి వినతిపత్రం అందజేయాలని పిటిషనర్లకు, దాని ఆధారంగా 3 నెలల్లో విచారణ పూర్తిచేయాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి స్పష్టం చేసింది.
అడ్మిషన్లు, నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం విచారణకు ఆదేశించేలా ఉత్తర్వులు ఇవ్వాలని సికింద్రాబాద్కు చెందిన దుర్గం రవీందర్ పిల్ దాఖలు చేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మోహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.