హైదరాబాద్, ఫిబ్రవరి 19, (నమస్తే తెలంగాణ): గిరిజన ప్రాంతాల్లో పంచాయతీ చట్టం (పెసా) నిబంధనలకు సవరణ తేవడంపై వివరణ ఇవ్వాలని కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.
2019లో ‘పెసా’ నిబంధనలకు సవరిస్తూ జారీచేసిన జీవో 54కు వ్యతిరేకంగా లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా దేవనాయక్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్ ధర్మాసనం సో మవారం విచారణ జరిపింది.
ఇది రాజ్యాంగ విరుద్ధమని, దీనివల్ల గిరిజనుల సంప్రదాయాలు, హకులను పరిరక్షించేందుకు తీసుకొచ్చిన చట్టం నీరుగారిపోతుందని పటిషనర్ తరపు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.