అనంతగిరి పరిరక్షణలోచట్ట ప్రకారం చర్యలు.. హైకోర్టు
అటవీ శాఖ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణలో భాగంగా అటవీ అధికారులు తమ చట్టబద్ధ విధులను నిర్వర్తించవచ్చని పేర్కొన్నది.
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): అటవీ శాఖ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణలో భాగంగా అటవీ అధికారులు తమ చట్టబద్ధ విధులను నిర్వర్తించవచ్చని పేర్కొన్నది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లోని వక్ఫ్ ఆస్తి స్వాధీనం, నిర్వహణలో అటవీ శాఖ జోక్యం చేసుకుంటున్నదంటూ మహ్మద్ ఫలియాజ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది.
అటవీ భూముల్లో ఆక్రమణలు, అనధికార కార్యకలాపాలు, చెత్త, నిర్మాణ వ్యర్థాలు, ఇతర వ్యర్థాల పారవేతను అడ్డుకొనే అధికారం అటవీ శాఖకు ఉన్నదని కోర్టు పేర్కొన్నది. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్‌ను ఏపీ ఫారెస్ట్ యాక్ట్-1967లోని సెక్షన్-4 కింద 1970 జూలై 7న నోటిఫై చేసినట్టు అటవీ శాఖ తన కౌంటర్లో తెలిపింది. మొత్తం 3,718 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించగా, 368.09 ఎకరాల ఎన్క్లోజర్ను రిజర్వేషన్ నుంచి మినహాయించినట్టు వివరించింది.
ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ, శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయం, సున్నీ మసీదు ఉస్మానియా, మదర్సా, యూసుఫైన్ ఓల్డ్ఏజ్ హోమ్ తదితర నిర్మాణాలు ఉన్నాయని తెలిపింది. చట్టబద్ధమైన స్వాధీ నం, మతపరమైన కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోలేదని, రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణ కోసమే తనిఖీలు, చర్యలు చేపట్టామని అటవీ శాఖ కోర్టుకు వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

