– సర్పంచ్ గుగులోత్ కిశోర్ నాయక్
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 22 : పారిశ్రామిక వాడ సారపాకను స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పంచాయతీ సర్పంచ్ గుగులోత్ కిశోర్నాయక్ అన్నారు. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా గాంధీనగర్, సంత ఏరియాల్లో ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావుతో కలిసి సర్పంచ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ, హరిత గ్రామ పంచాయతీగా సారపాకను తీర్చిదిద్దడానికి ప్రతిఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, పంచాయతీ ఈవో గుగులోత్ రవికుమార్, పాలకవర్గ సభ్యులు మువ్వా వెంకటేశ్వరరావు, ఏసోబు, కొమరం సావిత్రి, గౌరి, లక్ష్మిప్రసన్న, నాయకులు పాల్గొన్నారు.
స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీలో సర్పంచ్ బానోత్ సరోజ ఘన వ్యర్ధాల నిర్వహణ దినం పురస్కరించుకుని గ్రామంలో డంపింగ్ యార్డు వద్ద తడి, పొడి చెత్త వేరుచేయడంపై అవగాహన కల్పించారు. అనంతరం డంప్ యార్డు ప్రదేశం వద్ద పంచాయతీ సిబ్బందితో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించారు. తడి, పొడి చెత్తతో కలిగే లాభాలను ప్రజలకు సర్పంచ్ వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

‘సారపాకను స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యం’