Nilofar Golden Tips Tea | నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ.. హైదరాబాద్‌తోపాటు ఈ ప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన ఉత్పత్తులు, పానీయాలు అందిస్తున్నట్లు కేఫ్ ల్లిలోఫర్ తెలిపింది. హైదరాబాద్ వాసుల కోసం అరుదుగా లభించే ఆరోగ్యకర ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నదీ సంస్థ. అందులో భాగంగా అద్భుతమైన `నీలోఫర్ గోల్డెన్ టిప్స్ టీ` రీ లాంచ్ చేస్తున్నట్లు ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుముల శశాంక్ తెలిపారు.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లోని కేఫ్ ల్లిలోఫర్ ప్రీమియం లాంజ్‌లో భాగ్యనగర టీ ప్రేమికులకు ఈ నెల మూడో తేదీ నుంచి ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ చైర్మన్ ఏ బాబురావు అందుబాటులోకి తెచ్చారు. అసోంలోని టీ ఎస్టేట్లలో ఏడాది క్రితం పండించిన టీ లీఫ్స్ అధిక ధరకు వేలంలో కొనుగోలు చేసి, టీ ప్రేమికులకు అందుబాటులోకి తేవడమే దీని ప్రత్యేకత. సదరు టీ లీఫ్స్‌తో `నీలోఫర్ గోల్డ్ టిప్స్ టీ` తయారైంది.
నీలోఫర్ గోల్డెన్ టిప్స్ టీలో లభించే యాంటీ యాక్సిడెంట్లు, పోషకాలతో మన శరీరానికి బెనిఫిట్లు పొందొచ్చునని అనుముల శశాంక్ తెలిపారు. ప్రత్యేక వాసన, రుచి పోకుండా ఉండాలంటే ప్రతి రోజూ ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ లీఫ్స్ సేకరించాల్సి ఉంటుంది. ఈ ఆకులతో తయారు చేసిన టీ `24 క్యారట్ల గోల్డ్` మాదిరిగా కనిపిస్తుందని, భూగోళంపై ఇది అత్యంత ఆరోగ్యకరమైన పానీయం అని అనుముల శశాంక్ తెలిపారు.