సాగులో యాంత్రీకరణ తప్పనిసరి: ఉద్యాన వర్సిటీ వీసీ
భవిష్యత్తులో సాగులో యాంత్రీకరణ తప్పనిసరి కానున్నట్టు ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డీ రాజిరెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని కూరగాయల పరిశోధనా కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాంత్రీకరణ పెద్దస్థాయి వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాకుండా, కూరగాయల సాగు, పండ్ల తోటల్లోనూ విస్తృతంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : భవిష్యత్తులో సాగులో యాంత్రీకరణ తప్పనిసరి కానున్నట్టు ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డీ రాజిరెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని కూరగాయల పరిశోధనా కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాంత్రీకరణ పెద్దస్థాయి వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాకుండా, కూరగాయల సాగు, పండ్ల తోటల్లోనూ విస్తృతంగా ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులకు అధిక ఉత్పాదకత, తకువ శ్రమతో స్థిరమైన సాగు పద్ధతులను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆధునిక ప్లాంటర్లు, ట్రాన్స్ప్లాంటర్లతో నాట్లు వేగంగా జరుగడంతో రైతుల శ్రమ తగ్గి దిగుబడి పెరుగుతుందని చెప్పారు. యాంత్రిక వీడర్లు, పవర్‌టూల్స్ ద్వారా కలుపు నియంత్రణ సులభతరం అవుతుందని, రసాయనాలపై ఆధారపడటం తగ్గుతుందని తెలిపారు. ప్రెసిషన్ స్ప్రేయర్లు, డ్రోన్ల వినియోగంతో ఎరువులు, పంట సంరక్షణ మందులు ఆశించిన స్థాయిలో పిచికారీ చేయనున్నట్టు, దీంతో వృథా తగ్గి పర్యావరణానికి రక్షణ లభిస్తుందని రాజిరెడ్డి తెలిపారు. స్మార్ట్ సెన్సర్లు, డ్రోన్లు, డిజిటల్ పరికరాలతో పంట పెరుగుదల, నేల ఆరోగ్యం, చీడపీడల సమాచారం అందనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యంత్రాల కంపెనీ ప్రతినిధి త్రివిక్రమ్ పలు రోబోటిక్ మెషినరీ ప్రదర్శించి పని తీరును వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

