ERC | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) సభ్యుల నియామకం వివాదాస్పదమవుతున్నది. సివిల్ ఇంజినీర్‌కు టెక్నికల్ మెంబర్ బాధ్యతలు అప్పగించడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈఆర్సీకి ఇద్దరు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
టెక్నికల్ సభ్యుడిగా కే రఘు, ఫైనాన్స్ మెంబర్‌గా చెరుకూరి శ్రీనివాసరావును నియమిస్తూ జీవో-14విడుదల చేసింది. టెక్నికల్ సభ్యుడిగా నియమితులైన రఘు ట్రాన్స్‌కోలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా సివిల్ విభాగంలో పనిచేస్తున్నారు. విద్యుత్తు సంస్థల డైరెక్టర్లకు ఉన్నత అర్హతలుండాలని చెప్పిన సర్కారు.. ఒక డివిజినల్ ఇంజినీర్‌ను ఈఆర్సీ సభ్యుడిగా నియమించడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.