హైదరాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): సమాచార, పౌరసంబంధాల శాఖ(ఐఅండ్పీఆర్) స్పెషల్ కమిషనర్గా(ఎఫ్ఏసీ) టీ వినయ్కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుత కమిషనర్ ఎస్ హరీశ్ రెండు నెలలపాటు సెలవులపై విదేశాలకు వెళ్తున్నారు. దీంతో వినయ్కృష్ణారెడ్డికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూశాఖ జాయింట్ సెక్రటరీ బాధ్యతలను కూడా అప్పగించింది.