గవర్నర్కు పరిమిత అధికారాలే
‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్కు చాలా పరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఒక బిల్లు పార్లమెంట్ రూపొందించిన చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించేలా ఉన్నదని గవర్నర్ భావిస్తే.. ఆ బిల్లును రాష్ట్రపతికి మాత్రమే రిఫర్ చేయగలరు. లేదా తన అభిప్రాయంతో రాష్ట్ర అసెంబ్లీకి తిరిగి పంపవచ్చు. అసలు గవర్నర్ కార్యాలయం దురదృష్టవశాత్తూ కొనసాగుతున్న గత వలస పాలన వారసత్వ రూపం. మనకు గవర్నర్ వ్యవస్థ ఎందుకు ఉండాలో అర్థం కావడం లేదు.’
–రాజ్యసభ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్
గవర్నర్ను పార్టీలకు అతీతంగా గౌరవించాలి
గవర్నర్ వ్యవస్థను పార్టీలకు అతీతంగా గౌరవించాలి. కానీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవమాన పరుస్తున్నది.
– టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి.