హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రవాణా శాఖలో పలువురికి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్(డీటీసీ)లను జాయింట్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్(జేటీసీ)లుగా, రోడ్డు ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్(ఆర్టీవో)లను డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లుగా పదోన్నతి కల్పించింది. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా పదోన్నతులు పొందిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, శివలింగయ్య, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా పదోన్నతులు పొందిన రవీందర్‌కుమార్, వాణి, సదానందం, కిషన్, సురేశ్‌రెడ్డి గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): సంతానం లేని దంపతుల కోసం కేసీఆర్ సర్కార్ హయాంలో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రాలు రోగులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే గాంధీ దవాఖానలో ఐవీఎఫ్ సెంటర్ సేవలందిస్తుండగా, డిసెంబర్ 2న పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలో సైతం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గాంధీలో తొలి ఐవీఎఫ్ సెంటర్‌ను ప్రారంభించిన ఘనత కేసీఆర్ సర్కార్‌దే .