హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, అధికారులపై సోమవారం జరిగిన దాడిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలిసింది. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అధికారుల్లోనూ భయాందోళన వ్యక్తమవుతున్నది. లగచర్లలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ రైతులతో మాట్లాడుతున్న సందర్భంగా దాడి జరిగింది.
వెంటనే ఐజీ సత్యనారాయణ వికారాబాద్‌కు చేరుకొని పూర్తి వివరాలను సేకరించారు. గత నెల 25న కాంగ్రెస్ నాయకుడిపై రైతుల దాడి నేపథ్యంలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండి పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఎందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. భద్రతా వైఫల్యం నేపథ్యంలో ఎస్పీ నారాయణరెడ్డిపై వేటు వేసే అవకాశం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది.