సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ పట్టణ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కమిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. ఆదర్శనగర్‌లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు.
క్రిస్టియన్ పల్లిలో మందుల కమ్యూనిటీ ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేయనున్న స్మశాన వాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీరన్నపేటలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయంలో రూ. 172 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 20 కోట్లతో నిర్మించే మైనారిటీ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల పక్షాన నిలిచి పేదల అభివృద్ధికి పాటుపడుతున్నదని ఆయన తెలిపారు.
విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుందని అన్నారు.
మహబూబ్ నగర్ పట్టణానికి భారత్ మాల రోడ్ వస్తుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, కౌన్సిలర్ రాణి రాజు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

