హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ (విద్యుత్తు ప్రధాన భద్రతాధికారి)గా కే నందకుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్ట ల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నందకుమార్ ప్రస్తుతం టీజీఎస్పీడీసీఎల్లో చీఫ్ ఇంజినీర్ ప్రాజెక్ట్స్‌గా పనిచేస్తున్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్-1ను ఇటీవలే ప్రారంభించారు. ఈ యూనిట్‌ను చార్జ్ చేయాల్సి ఉన్నది. సీఈఐజీ అనుమతులు లభించలేదు.
తాజాగా నందకుమార్‌ను సీఈఐజీగా నియమించగా, ఆయన అనుమతులతో బుధవారం వైటీపీఎస్‌లో తనిఖీలను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, కొత్త సీఈఐజీగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన నందకుమార్‌ను నియమించడంపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇందుకోసమేనా? తెలంగాణను తెచ్చుకున్నదని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కా రు తొలినాళ్ల నుంచి ఆంధ్రా వారికి కీలక పోస్టులను కట్టబెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.